అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరి, ఇతర కళాశాలలో చేరేందుకు ఆగస్టు 31న డిలీట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. విద్యార్థులు తమకిష్టమైన కళాశాలలో లేదా ఇతర గ్రూపుల్లో చేరడానికి అవకాశం కల్పించాలని అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశించారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందడానికి సెప్టెంబర్ 7వ తేదీ వరకు అవకాశం ఉందని గుర్తు చేశారు.