అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్‌ : విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం సుద్దాపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, బాలికల కళాశాలను జిల్లా జడ్జి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు ఐకమత్యం, సహకారం చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి యోహాన్‌, జిల్లా మెడికల్‌ అధికారిణి రాజశ్రీ, తహశీల్దార్‌ ప్రభాకర్‌, ప్రిన్సిపాల్‌ నళిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.