అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: భవిష్యత్తులో జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో రాణించి ఇందూరు పేరు నిలబెట్టాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ తైక్వాండో ఛాంపియన్షిప్ లో జిల్లాకు చెందిన సహస్ర రాథోడ్(బంగారు), అవి రాజ్, ఆధృతి, ఆర్ధిక శుక్ల(రజతం), సాయి ప్రసన్న, గణ(కాంస్య) పతకాలు సాధించారు. వీరిని మంగళవారం జిల్లా జడ్జి అభినందించారు. క్రీడాకారుల వెంట కోచ్ మనోజ్ ఉన్నారు.