అక్షరటుడే, ఇందూరు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని.. అందుకోసం కష్టపడాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మహిళలు ఉన్నతంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి విద్యార్థి దశ నుంచే కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పద్మావతి, డీఐవీవో రవికుమార్, కళాశాల ప్రిన్సిపల్ బుద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.