అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి సునీత కుంచాల శుక్రవారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని నాగారంనకు చెందిన షేక్‌ మాజీద్‌, ఎల్లమ్మగుట్టకు చెందిన షేక్‌ జుబేర్‌లు స్నేహితులు. వారిద్దరు ఆటో నడుపుతుండేవారు. అయితే జుబేర్‌ భార్య గురించి మాజీద్‌ పలుమార్లు అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో విసుగు చెందిన జుబేర్‌ మాజీద్‌ను మట్టుబెట్టాలని పథకం రచించాడు. ఈ క్రమంలో 2021 డిసెంబర్‌ 29న రాత్రి కల్లు సేవించేందుకు మాజీద్‌ను ఫోన్‌ చేసి పిలిచాడు. అయితే తన చిన్నాన్న షేక్‌ అతీక్‌కు విషయం తెలిపి.. ముగ్గురు కలిసి ఆటోలో మాధవనగర్‌ శివారుకు వెళ్లి కల్లు సేవించారు. అనంతరం మాజీద్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో అతీక్‌ సహాయంతో జుబేర్‌ను పొడిచాడు. జుబేర్‌ మరణించిన తర్వాత మృతదేహాన్ని వ్యవసాయ కాలువలో పడేసి పారిపోయారు. విచారణ చేపట్టిన డిచ్‌పల్లి పోలీసులు నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. వీరిద్దరిపై నేరం రుజువు కావడంతో జడ్జి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bar Association | బార్ అసోసియేషన్​కు వాటర్ డిస్పెన్సర్స్ అందజేత