అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని బీసీ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులకు జిల్లాస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 28, 29వ తేదీలో బోధన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రీడా పోటీలు ఉంటాయన్నారు. అలాగే 30వ తేదీన జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో కల్చరల్ కార్నివాల్ ఉంటుందని పేర్కొన్నారు.