అక్షరటుడే, ఇందూరు: పరిసరాల పరిశుభ్రతతోనే దోమలను నివారించవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. శుక్రవారం నగరంలోని వినాయక్ నగర్, గాయత్రినగర్ లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం డ్రై డేగా పాటించాలని సూచించారు. ఇళ్లలోని కూలర్లు, నీటి తొట్టిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలు నీటి నిల్వలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకురాలు శాంతకుమారి, ఏఎన్ఎం విటాబాయి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.