అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం : రాష్ట్రంలో అటల్ టింకరింగ్‌లను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ, విజ్ఞాన్ ఆశ్రమ్ పూణే, యునిసెఫ్ సహకారంతో పనిచేస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి పేర్కొన్నారు. భిక్కనూరులోని ఉన్నత పాఠశాలలో మూడు రోజుల వర్క్ షాప్ ను డీఈవో రాజ గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి మాట్లాడుతూ.. జిల్లాలో 19 ఏటీఎల్ ల్యాబ్ లున్నాయని, వాటిలో విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగంలో ఐవోటీ ఆధారిత ప్రాజెక్టులను పాఠశాల స్థాయి నుంచి నేర్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భిక్కనూరు ఏటీఎల్ ఇన్‌ఛార్జి తమ్మల రాజు, ఏటీఎల్ మాస్టర్ ట్రైనీలు గణేష్ , వెంకటేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.