అక్షరటుడే, ఇందూరు: SGF football | స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వనపర్తిలో జరిగిన అండర్–14 బాలికల ఫుట్బాల్ పోటీ(football competition)ల్లో జిల్లా జట్టు మొదటి స్థానం సాధించింది. ఫైనల్లో ఆదిలాబాద్(Adilabad)పై 2-0 స్కోరు తేడాతో గెలుపొంది ఛాంపియన్గా నిలిచింది.
టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హరిణి యాదవ్(విజన్ పబ్లిక్ స్కూల్), నక్షత్ర, మాధవి (జడ్పీహెచ్ఎస్, బోర్గాం) జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఎస్జీఎఫ్(SGF) జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు. క్రీడాకారులను డీఈవో అశోక్ బుధవారం తన కార్యాలయంలో అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు గోపి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.