అక్షరటుడే, కామారెడ్డి : పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సింధుశర్మ హెచ్చరించారు. దీపావళి సందర్భంగా మూడు రోజులుగా ఎల్లారెడ్డి, బాన్సువాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో 24 మందిపై కేసులు నమోదు చేసి 17 మొబైల్స్, రూ.2,04,620 స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే కామారెడ్డి టాస్క్ ఫోర్స్ అధికారులు 8712686109, 8712686133కు, లేదా 100కు ఫోన్ చేయాలన్నారు.