అక్షరటుడే, ఇందూరు: సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పని చేయాలని డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమల నియంత్రణకు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మలేరియా, డెంగీ తదితర వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానంగా ఉన్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, డాక్టర్ రమేష్, డాక్టర్ అంజన, డాక్టర్ విద్య, డాక్టర్ లావణ్య, డాక్టర్ నాగరాజు, డాక్టర్ అశోక్, డాక్టర్ రాజు, ఏవో చందర్ తదితరులు పాల్గొన్నారు.