అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో పీహెచ్‌సీ వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరూ సమయపాలన పాటించాలని, లక్ష్యం మేరకు ఓపీ సేవలందించాలని సూచించారు. ఫీల్డ్ కు వెళ్తే మూవ్‌మెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని, పీహెచ్‌సీ పరిధిలోని హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారులు రమేష్, రాజు, జిల్లా టీకాల నియంత్రణ అధికారి అశోక్, జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి తుకారాం రాథోడ్, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement