Haleem : హలీం ఎక్కువగా తింటున్నారా.. అయితే, ఈ వ్యాధులు ఉంటే అస్సలు తినకూడదు..? ఎందుకో తెలుసా..?

Haleem : హలీం ఎక్కువగా తింటున్నారా.. అయితే, ఈ వ్యాధులు ఉంటే అస్సలు తినకూడదు..? ఎందుకో తెలుసా..?
Haleem : హలీం ఎక్కువగా తింటున్నారా.. అయితే, ఈ వ్యాధులు ఉంటే అస్సలు తినకూడదు..? ఎందుకో తెలుసా..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Haleem : ప్రతిసారి Ramadan రంజాన్ మాసం మొదలైందంటే .. అందరూ కూడా హలీమ్ కోసం ఎదురుచూస్తారు. Ramadan Festival రంజాన్ పండుగకు నెలరోజులు ముందు నుంచే హలీమ్ మొదలవుతుంది. అయితే హలీమ్ Haleem ని కొందరు అస్సలు తినకూడదు. ఎవరు ఎక్కువ తినకూడదు, తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు Health problems వస్తాయో తెలుసుకుందాం.. రంజాన్ మాసంలో హలీం వచ్చిందంటే, జనాలు తెగ తినేస్తారు. హైదరాబాదులో లభించే వంటకాలలో ఈ హలీమ్ కూడా ఒకటి. వాస్తవానికి ఈ వంటకం అరబిక్ కి చెందినది.

ఇది నిజాం పరిపాలనలో ప్రాచుర్యం పొందినది. ఈ హలీమ్ ని ఎంతో ఇష్టంగా తింటారు. రాయల్ ఫ్యామిలీకి ఈ హలీమ్ Haleem ఎంతో ఇష్టంగా నచ్చింది. ఈ హలీంని దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం ఉపవాస దీక్షలు పాటిస్తుండగా, ఈ హలీమ్ ని వారు ఉపవాసా దీక్ష విరమణ చేసే ముందు తింటారు. ఆ రోజంతా ఉపవాసం చేసిన నీరసించిన వారికి ఇది తక్షణమే శక్తినిస్తుంది. అందుకే ఈ హాలీమ్ రంజాన్ నెల ప్రారంభంలో మనకి అందుబాటులో లభిస్తుంది. ప్రత్యేకమైన రుచి, నువ్వు పోషక గుణాలను కూడా కలిగి ఉంటుంది. అసలు హలీం Haleem పుట్టుక, ప్రాచీన కాలంలో ఇరాన్ దేశంలో జరిగింది. మరి దీనిని మితంగా తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా తిన్నారంటే Health problems ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు.

హలీమ్ తయారీ : హలీం తయారీలో ప్రధానంగా గోధుమలు, మాంసం, రకాల పప్పులని వాడుతారు. గోధుమల్లో అధికంగా ఫైబర్ కలిగి ఉంటుంది. కాబట్టి జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. ఆకలిని అదుపులో ఉంచుటకు కూడా ఇది సహాయపడుతుంది. కాగా.. బరువు తగ్గాలనుకునే వారికి హలీం బెస్ట్ ఆప్షన్. ఈ హలీంలో ప్రోటీన్లతో నిండిన శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పులను కూడా వినియోగిస్తారు. కండరాలను బలంగా ఉంచడమే కాదు.. దానికి కావాల్సిన శక్తిని తక్షణమే ఇస్తాయి. వీటిలో అల్లం, వెల్లుల్లి వంటి పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు హలీం తినొచ్చా : షుగర్ వ్యాధి ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా తీసుకున్నారంటే అనారోగ్య సమస్యలు తప్పవు.

గుండె సమస్యలు ఉన్నవారు: ఈ హలీంలో ఎక్కువ నూనె కలిగి ఉంటుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే తక్కువ నూనెను వాడొచ్చు. ఇలా చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు బయట లభించే హలీంని తినకపోవడం మంచిది.

చిన్నపిల్లలు : చిన్నపిల్లలకు నాడీ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వీరు కూడా హలీంని ఎక్కువగా తినకూడదు.

గర్భిణీలు, వృద్ధులు : వీరు కూడా మసాలాలు ఉన్న హలీంని తీసుకుంటే అంత మంచిది కాదు. ఒక వేళ తీసుకోవాలి అనుకుంటే మితంగా తీసుకోవాలి. హలీం రుచికి మాత్రమే పరిమితం కాదు. ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం హలీం వలన కొందరికి కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి, వారి వారి శరీర అవసరాలకు అనుగుణంగా తగిన మోతాదుల్లో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement