Ice Cream : సమ్మర్ లో ఐస్ క్రీమ్స్ తెగ తినేస్తున్నారా..? ఇది తెలిస్తే.. జన్మలో ఐస్ క్రీమ్ జోలికి పోనే పోరు..!

Ice Cream : సమ్మర్ లో ఐస్ క్రీమ్ లు తెగ తినేస్తున్నారా... ఇది తెలిస్తే... జన్మలో ఐస్ క్రీమ్ జోలికి పోనే పోరు....?
Ice Cream : సమ్మర్ లో ఐస్ క్రీమ్ లు తెగ తినేస్తున్నారా... ఇది తెలిస్తే... జన్మలో ఐస్ క్రీమ్ జోలికి పోనే పోరు....?

అక్షరటుడే, వెబ్ డెస్క్ Ice Cream : ఎండాకాలం వచ్చిందంటేనే కూల్ డ్రింక్స్ ని, ఐస్ క్రీమ్, చల్ల చల్లని పానీయాలని తెగ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఐస్ క్రీమ్ అంటే ఎంతో ప్రీతి. కొందరైతే వర్షం పడుతున్నా కూడా ఐస్క్రీమ్ ని ఆస్వాదిస్తుంటారు. చలికాలంలో ఎప్పుడు పడితే అప్పుడు, తినే వారు కూడా ఎక్కువే. అయితే, మరి ఈ ఐస్ క్రీమ్ ని ఎక్కువగా తినడం వల్ల, దీని వెనుక దాగి ఉన్న ప్రమాదాలు ఎంతోమందికి తెలియవు.

Advertisement
Advertisement

ఇది తెలియక ఐస్ క్రీమ్ లను తెగ తింటూ ఉంటారు. కొన్ని ఐస్ క్రీమ్స్ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే కల్తీ పదార్థాలతో ఇప్పుడు మార్కెట్లో తయారు చేయడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగించే కొన్ని హానికర రసాయనాలు మన ఆరోగ్యాన్ని తీవ్రమైన ప్రమాదానికి గురి చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్ క్రీమ్, శీత‌ల పానీయాలలో డిటర్జెంట్ పౌడర్ కలిపి కల్తీ చేస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

కర్ణాటకలో బెంగుళూరులో ఉన్న ఐస్ క్రీమ్, శీతల పానీయాల తయారీ సంస్థలో నాసిరకం పదార్థాలతో తయారుచేసిన ఉత్పత్తులు బయటపడ్డాయి. క్రీమ్ తయారీకి బట్టలు ఉతికే సబ్బు పౌడర్ ను ఉపయోగిస్తున్నారు. శీతల పానీయాల్లో నురుగు ఎక్కువగా కనిపించేందుకు ఫాస్పోరిక్ ఆమ్లాన్ని కలిపినట్లు తెలిసింది. అదే తరహాలో ఖర్చులను తగ్గించేందుకు యూరియా కలిపిన కృత్రిమ పాలన ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా ఐస్ క్రీమ్, శీతల పానీయాల నాణ్యత తనిఖీకి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Beers : సమ్మర్ లో బీర్లు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే, మీకు బ్యాడ్ న్యూస్.. ఈ బీర్లు తాగితే

ఈ ఐస్ క్రీమ్స్ తింటే వికారం, వాంతులు, విరోచనాలు, గొంతు ఇబ్బందులు, కడుపు సమస్యలు, అన్నవాహిక దెబ్బతినడం, శ్వాసకోశ సమస్యలు, కాలేయం, మూత్రపిండాలకు హాని జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఫాస్ఫోరిక్ ఆమ్లం వల్ల కలిగే హానికర ప్రభావాలు : మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం, మూత్రపిండాల పనితీరు తగ్గిపోవడం, ఎముకలు బలహీన పడడం, పళ్ల క్షయం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఐస్ క్రీములు కొనుగోలు చేసే సమయంలో పరిశుభ్రమైన ప్రదేశాలు, విశ్వసనీయ దుకాణాలను ఎంచుకోవడం ఉత్తమం.

Advertisement