Dry Prawns | ఎండు రొయ్యలతో ఎన్ని లాభాలో తెలుసా..!

Dry Prawns | ఎండు రొయ్యలతో ఎన్ని లాభాలో తెలుసా..!
Dry Prawns | ఎండు రొయ్యలతో ఎన్ని లాభాలో తెలుసా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dry Prawns | టమాట, ఉల్లిపాయలతో tomatoes and onions పాటు ఎండు రొయ్యల కూర చేసుకుని తింటే ఆహా.. ఆ రుచే వేరు.. ఒకప్పుడు వారంలో రెండు రోజులైనా కూరల్లో రొయ్యలు వేసుకునేవారు. కానీ గత కొన్నేళ్లుగా వీటి వినియోగం తగ్గిపోయింది. అయితే. ఆరోగ్యానికి మేలు చేసే నాన్​వెజ్ రకాల్లో non-veg types “సీ ఫుడ్స్” “Sea foods” ముందుంటాయి. ఎక్కువ మంది ఫిష్​ను ప్రిఫర్​ చేస్తారు. కానీ ఎండు రొయ్యలు తినేందుకు అంతగా అంతగా ఇంట్రస్ట్ చూపించరు. కానీ వీటిలో అయితే ఎండు రొయ్యలతో ఎన్ని లాభాలో తెలిస్తే మీరు వాటిని వదలరు.

Advertisement

Dry Prawns | ఉపయోగాలెన్నో..!

ఎండురొయ్యల్లో కాల్షియం ఉండడం వల్ల ఎముకలు, దంతాల bones and teeth ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇందులో పొటాషియంలో శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడడంతో పాటు రక్తపోటును నియంత్రించేందుకు తోడ్పడుతుందని control blood pressure నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రొయ్యల్లోని ఇనుము రక్తహీనతను నివారిస్తుందంటున్నారు. అలాగే ఇందులో ఉండే అయోడిన్​ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే వీటిలో సోడియం మోతాదు ఎక్కువగా ఉండడం వల్ల బీపీ BP ఉన్నవారు మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Dry Prawns | పోషకాలు అధికమే..

ఎండు రొయ్యలు Dried prawns పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రొటీన్ ఎక్కువగా high protein ఉండడం వల్ల ఇది కండరాలు, చర్మం, ఇతర శరీర కణాల నిర్మాణానికి, మరమ్మతుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతునానరు. వీటిలో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్​ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే వీటిలో విటమిన్​ డి, బీ 12లు vitamins D and B12 నాడీ వ్యవస్థ మెరుగుదల, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అయితే వీటిలో సోడియం, కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

Advertisement