
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Champions Trophy : 12 ఏళ్ల తర్వాత భారత్ మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. కోట్లాది మంది అభిమానులు టీమిండియా గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు. వారి పూజలు ఫలించాయి. ఇండియా గొప్ప విజయం సాధించడంతో ఆనందలో మునిగిపోయారు ఫ్యాన్స్. ఇక రచిన్ రవీంద్రకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కగా, రోహిత్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీని అందుకునేటప్పుడు భారత ఆటగాళ్లు అందరూ వైట్ జాకెట్స్‌ను ధరించి ఉండడం మనం గమించే ఉంటాం. చారిత్రక ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ గెలవడంతోపాటు జట్టుకు గౌరవంగా వైట్ కోట్ ఇవ్వడం జరుగుతుంది.
Champions Trophy : ఇది అసలు కథ..
ఇందుకు ఓ చిరిత్రం ఉందట. ఫైనల్‌లో గెలిచిన తర్వాత భారత జట్టు ట్రోఫీని అందుకోవడానికి మైదానంలోకి దిగినప్పుడు, వారికి ప్రత్యేక వైట్ జాకెట్ అందజేస్తారు. వాటిని ధరించిన తర్వాతే విజేతలు మైదానంలోకి అడుగు పెడతారు. ఈ సంప్రదాయం 2009 ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కొనసాగుతోంది. ఈ వైట్ సూట్ ఆటగాళ్ల గొప్పతనం, దృఢ సంకల్పాన్ని సంగ్రహించే “గౌరవ బ్యాడ్జ్” అని ఐసీసీ తెలియజేసింది. దీనిని ఛాంపియన్స్‌కి గౌరవ చిహ్నంగా అభివర్ణిస్తుంటారు. ఈ జాకెట్‌ను ముంబైకి చెందిన బబితా ఎమ్ డిజైన్ చేశారు. దీన్ని ఇటాలియన్ ఉన్ని తో ప్రత్యేకంగా మలుస్తారు. బంగారు అంచు, జాకెట్‌పై ప్రత్యేక ఎంబ్రాయిడరీ చేసిన బంగారు లోగో కూడా ఉంటుంది.
1998 నుండి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కాగా, వైట్ జాకెట్స్ ఇచ్చే సంప్రదాయాన్ని ఐసీసీ 2009లో ప్రవేశపెట్టింది. అయితే.. ఇది సాధారణ వైట్ జాకెట్స్ మాత్రం కాదండోయ్. దీనిని అత్యంత ఖరీదైన ఇటాలియన్ నూలుతో తయారు చేస్తారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని చేతుల మీదుగా విజేతలకి వైట్ కోట్ అందివ్వడం జరిగింది. ముందుగా వరుణ్ చక్రవర్తి ఈ కోట్ 2013లో ధోని నాయకత్వంలో భారత్ ఛాంపియన్స ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పుడు ధోనితో మిగిలిన ఆటగాళ్లు అందరూ కూడా వైట్ జాకెట్స్ ధరించే ట్రోఫీని అందుకున్నారు.