Loans | అప్పు కావాలా నాయనా..

Loans | అప్పు కావాలా నాయనా..
Loans | అప్పు కావాలా నాయనా..
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Loans | అప్పు ఇచ్చేవాడు, సమృద్ధిగా నీరు, వైద్యుడు ఉండే ప్రాంతంలో ఉండాలని సుమతీ శతకంలో కవి బద్దెన ఎప్పుడో చెప్పాడు. గతంలో అప్పు దొరకడం కష్టంగా ఉండేది. ప్రజలు అధిక వడ్డీకి వ్యాపారుల వద్ద డబ్బు తీసుకొని అనేక అవస్థలు పడేవారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. అడగ్గానే అప్పు ఇచ్చే సంస్థలు పుట్టుకొచ్చాయి. అప్పు కావాలా నాయనా అంటూ ఆయా సంస్థల ప్రతినిధులు మన తలుపులే తడుతున్నారు.

Loans | అవసరం లేకున్నా..

ప్రస్తుతం దేశంలో అనేక మైక్రో ఫైనాన్స్​(Micro Finance) సంస్థలు పుట్టుకొచ్చాయి. బంగారం(Gold), వాహన(Vehicle), గృహ(House) రుణాలు(Loans) విరివిగా ఇస్తున్నాయి. అవసరం లేకున్నా ఆయా సంస్థల ప్రతినిధులు మీకు లోన్​ ఇస్తామంటూ ప్రజలకు ఆశ చూపుతున్నారు. తమ టార్గెట్​ రీచ్​ కావడం కోసం ఇష్టారీతిన లోన్లు ఇస్తున్నారు.

Loans | కట్టడం ఎలా..

సాధారణంగా ఆయా కంపెనీలు రుణాలు ఇచ్చే ముందు రుణగ్రహీతల పూర్తి వివరాలు తెలుసుకుంటాయి. లోన్​ తిరిగి కట్టగలడా లేదా అని చూస్తాయి. ప్రతి నెలా సంపాదన(Income) ఎంత అని కూడా ఆరా తీస్తాయి. అయితే ఆయా కంపెనీలు తమ సిబ్బందికి లోన్ల టార్గెట్​(Target) ఇవ్వడంతో వారు అనర్హులకు కూడా లోన్​ ఇస్తున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి.. ఆదాయం లేకున్నా రుణం అంటగడుతున్నారు. రుణం తీసుకున్న కొన్ని రోజులు బాగానే కడుతున్నా.. తర్వాత వాయిదాలు కట్టడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ బయట అప్పులు చేస్తున్నారు.

Loans | లోన్​యాప్​లు

లోన్​యాప్​లు(Loan apps) సైతం ప్రజలకు అడగ్గానే రుణాలు ఇస్తున్నాయి. అయితే భారీగా వడ్డీలు(Interest) వసూలు చేస్తూ ప్రజల నడ్డీ విరుస్తున్నాయి. డబ్బులు కట్టడంలో ఆలస్యం అయితే వారిని బ్లాక్​ మెయిల్​ చేస్తున్నాయి. దీంతో పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ప్రజలు అవసరం ఉంటేనే రుణాలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లోన్​ యాప్​ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  RBI | త్వరలో కొత్త రూ.100, రూ.200 నోట్లు

Loans | క్రెడిట్​ కార్డులు

ప్రస్తుతం పర్సులో పైసల కంటే కార్డులే(Credit Cards) ఎక్కువగా ఉంటున్నాయి. ఒక కార్డు తీసుకొని దాని ద్వారా అనేక కార్డులు పొందుతున్నారు. అయితే కార్డు ఉంది కాదా అని ఇష్టారీతిగా ఖర్చు పెట్టేవారు పెరిగిపోయారు. బిల్లు కట్టేటప్పుడు చూసుకుందాం అని మొదట ఖర్చు చేస్తున్నారు. తీరా బిల్లు(Bill) సమయం వచ్చాక వారిని వీరిని అడుగుతూ అవస్థలు పడుతున్నారు. బిల్లు చెల్లింపు చేయడంలో ఆలస్యం అయితే ఆయా క్రెడిట్​కార్డుల సంస్థలు భారీ ఫైన్లతో కస్టమర్లకు వాతలు పెడుతున్నాయి. ఇలా క్రెడిట్​ కార్డుల ఊబిలో చిక్కుకున్న ఎంతో మంది వాటి నుంచి బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు.

Loans | ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. ప్రపంచలో మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్​ కలలు కంటోంది. అయితే అనవసర అప్పులు రానున్న రోజుల్లో దేశానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇప్పుడు విరివిగా.. అనర్హులకు ఇస్తున్న లోన్ల ప్రభావం రానున్న రోజుల్లో బ్యాంకింగ్(Banking)​ రంగంపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఫిన్​టెక్​ కంపెనీలకు గడ్డుకాలం వచ్చే రోజులు దగ్గరోలోనే ఉన్నాయి. ఆర్​బీఐ(RBI) కూడా ఇలాంటి రుణాలపై గతంలో పలు సూచనలు చేసింది. మైక్రో ఫైనాన్స్​ కంపెనీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.

Advertisement