Advertisement
అక్షరటుడే, ఇందూరు: డాక్టర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని నాగారంలో గల బంజారా భవన్లో శనివారం సేవాలాల్ జయంతి, భోగ్ బండార్ నిర్వహించారు. అనంతరం మెడికల్ రిప్రజెంటేటీవులకు నిర్వహించిన క్రికెట్ పోటీలో గెలుపొందిన వారికి డాక్టర్ సేవ సమితి అధ్యక్షుడు డాక్టర్ కేతావత్ మోతిలాల్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పిట్ల స్వామి మహరాజ్, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, వైద్యులు హరికృష్ణ, రమేష్, చౌహన్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement