Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ కోసం గుండె తరలింపులో హైదరాబాద్ మెట్రో కీలకపాత్ర పోషించింది. ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకపూల్ గ్లోబల్ ఆస్పత్రికి మెట్రో రైలులో వైద్యులు గుండెను తరలించారు. ఇందుకోసం మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నిమిషాల్లో చేరుకున్నారు. అనంతరం రోగికి గుండెను అమర్చారు.
Advertisement