అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద డాక్యుమెంట్‌ రైటర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ విషయంలో సబ్‌ రిజిస్టార్లు లేనిపోని కొర్రీలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు డ్యాకుమెంట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో అనవసరంగా ఇబ్బందులు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.. ఈ విషయమై ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, డాక్యుమెంట్‌ రైటర్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆయన సూచన మేరకు వారు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీని కలిశారు.