అక్షరటుడే, వెబ్‌డెస్క్ Viral Video : సాధారణంగా పాములు అంటేనే మనుషులు భయపడతారు. పాముల్లో అన్నీ విషపూరితం కాకపోయినా అసలు పామును చూడగానే కొందరైతే బెంబేలెత్తిపోతారు. అందులోనూ నాగుపాము లాంటి డేంజరస్ పాము మన ముందు ఉంటే ఇక మనం అక్కడ ఉంటామా? పరుగో పరుగు.. అంటూ అక్కడి నుంచి పారిపోవాల్సిందే. మనమంటే మనుషులం. పాము కరిస్తే ఏమౌతుందో మనకు తెలుసు. కానీ.. కుక్కలకు తెలియదు కదా. అందులోనూ నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి కుక్కలు తమ ఓనర్ కు ఎలాంటి సమస్య వచ్చినా మేమున్నాం అంటూ ముందుకెళ్తాయి. సేమ్ ఇలాగే ఓ కుక్క చేసి శెభాష్ అనిపించుకుంది. కాకపోతే ఆ కుక్క చేసిన పనికి కొందరు కుక్క ఓనర్ పై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.
ఓ పెంపుడు కుక్క నాగుపామును నోటితో కొరికి ముక్కలుగా చేసేసింది. అది కూడా క్షణాల్లో, రెప్పపాటులో ఆ కుక్క దాన్ని కొరికేసింది. ఓ ఇంటి పేరట్లో నాగుపాము బుసలు కొడుతూ ఉంది. దాన్ని చూసిన ఆ ఇంటి పెంపుడు కుక్క అక్కడికి పరిగెత్తుకెళ్లి దాన్ని పట్టుకొని అటు చూసి ఇటు చూసే లోపే ముక్కలు చేసి అక్కడ పడేసింది. దీంతో ఆ పాము తల, తోక రెండు వేర్వేరు అయిపోయాయి. అయినప్పటికీ ఆ పామును వదల్లేదు కుక్క. ఇంకాస్త వైల్డ్ గా మారి, తల భాగాన్ని కూడా కొరికి కొరికి ముక్కలు చేసేసింది.
Viral Video : కుక్కకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు
ఇదంతా బాగానే ఉంది కానీ, అసలు కుక్క అంత పని చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు. వీడియో తీస్తూ కూర్చున్నావు. దాన్ని ఆపొచ్చు కదా. స్నేక్ క్యాచర్ ని పిలిస్తే ఆ పామును పట్టుకెళ్తారు కదా. కుక్క దాన్ని ముక్కలు చేస్తుంటే దాన్ని ఆపకుండా వీడియో తీస్తావా? అంటూ ఆ కుక్క ఓనర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ కుక్క చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఆ కుక్క ఓనర్. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకవేళ కుక్కను ఆ పాము కరిస్తే ఇంకేమైనా ఉందా? కుక్క ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కదా. నువ్వేం ఓనర్ వు అంటూ పాపం ఆ ఓనర్ కు మాత్రం నెటిజన్లు మొట్టికాయలు వేస్తూనే ఉన్నారు. ఇంతకీ మీరు ఆ వీడియో చూశారా?
View this post on Instagram