అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: బీబీపేట కేజీబీవీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ మరో ముగ్గురు సిబ్బందిని వెనక్కి పంపించాలని దోమకొండ కేజీబీవీ విద్యార్థినులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పాఠశాల వద్ద భైఠాయించి సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్తగా వచ్చిన వాళ్లను పంపించే వరకు ఆహారం తీసుకోబోమని ఎంఈవో విజయకుమార్ కు స్పష్టం చేశారు. దీంతో డీఈవో, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడి తిరిగి పంపిస్తానని ఎంఈవో హామీ ఇచ్చినా విద్యార్థినులు వినలేదు. డిప్యూటేషన్ పై వచ్చిన సిబ్బందిని వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు.