అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 56 పాయింట్లు నష్టపోయి 81,709 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 24,677 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ ఫిఫ్టీలో టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మారుతి, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్ షేర్లు ఒక శాతానికి పైగా లాభపడగా సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ తదితర షేర్లు నష్టాల బాటలో పయనించాయి.