అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఉదయం 122 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. కొద్దిసేపటికే ఇంట్రాడే గరిష్టాల నుంచి 381 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత కోలుకుని కనిష్టాల నుంచి 419 పాయింట్లు పెరిగింది. ఇరవై ఒక్క పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 106 పాయింట్లు పడిపోయినా వెంటనే కోలుకుని 128 పాయింట్లు పెరిగింది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 60 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. నిఫ్టీ ఫిఫ్టీలో బజాజ్ ఆటో, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టైటాన్ షేర్లు ఒక శాతానికి పైగా లాభపడగా సిప్లా, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోతున్న స్టాక్స్ జాబితాలో ఉన్నాయి.