అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనా.. కొద్దిసేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో వంటి ఐటీ స్టాక్స్‌తో పాటు ఎస్‌బీఐ, రిలయన్స్‌ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. రీ2 రిజల్ట్స్‌ అంచనాలకు అనుగుణంగా రాకపోవడంతో బజాజ్‌ ఆటో నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు ధర ఇంట్రాడేలో 11 శాతానికి పైగా పడిపోయింది. హీరో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి వంటి ఆటో షేర్లు సైతం ఒత్తిడికి గురవుతున్నాయి.