అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైనా బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త తేరుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, విప్రో, ఐచర్ మోటార్స్, హీరో, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ వంటి స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్జ్యూమర్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఎయిర్టెల్ నష్టాల్లో పయనిస్తున్నాయి.