అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 237 పాయింట్లు, నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా కొద్దిసేపటికే కోలుకున్నాయి. 11:20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 115 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఐచర్ మోటార్స్, సిప్లా, ఇండస్ ఇండ్, హిందాల్కో లాభాలలో కొనసాగుతుండగా.. అదాని పోర్ట్స్, అపోలో హాస్పిటల్, శ్రీ రామ్ ఫైనాన్స్, ట్రెంట్,ఐటిసి, బీఈఎల్, కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.