అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైనా.. క్రమంగా లాభాలబాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 880 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 759 పాయింట్ల లాభంతో 79,802 పాయింట్ల వద్ద, నిఫ్టీ 216 పాయింట్ల లాభంతో 24,131 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎయిర్ టెల్, సిప్లా, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్ లాభపడగా పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటార్, అపోలో హాస్పిటల్స్, నెస్లే స్టాక్స్ నష్టపోయాయి.