అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టంగా 807 పాయింట్లు, నిఫ్టీ 230 పాయింట్లు పెరిగాయి. ఉదయం 12:15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో కదలాడుతున్నాయి. నిఫ్టీ ఫిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రయిసెస్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ నష్టాలతో ఉండగా.. రిలయన్స్, ఎయిర్టెల్, సన్ ఫార్మా, సిప్లా, దివిస్ ల్యాబ్, ఎం అండ్ ఎం రెండు శాతానికి పైగా లాభంతో కొనసాగుతుండగా ఎల్టీఐఎం, విప్రో, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డి, గ్రాసిం, హెచ్యూఎల్, నెస్లే, టాటా కన్స్యూమర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ ఒక శాతానికి పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.