అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 80,121 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,204 పాయింట్ల వద్ద ఓపెన్ అయ్యాయి. ఉదయం 11:45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 17 పాయింట్ నష్టంతో 79,986 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 24,190 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సైమన్స్, ప్రిజం జాన్సన్, హెచ్‌ఎస్‌సీఎల్, హడ్కో లాభాల్లో ట్రేడ్ అవుతుండగా క్రిసిల్, క్రాఫ్ట్స్ మెన్, సిప్లా తదితరుల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.