Advertisement
అక్షర టుడే, భీమ్‌గల్: Bhimgal | వేసవిలో ప్రజలకు తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చేయవద్దని ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని ముచ్కూర్‌లో పర్యటించారు. గ్రామంలో 4 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, మంచినీటి బావి, బోరుమోటార్లు పరిశీలించారు. అవసరమైనవాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. నల్లాలకు ఎవరూ మోటార్లు ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. ఆయన వెంట ఇంట్రా ఏఈ అమూల్య, ఎంపీఓ జావేద్, మిషన్ భగీరథ సిబ్బంది ఉన్నారు.
Advertisement