అక్షరటుడే, బాన్సువాడ: farmers | రైతులు(farmers) దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. వర్ని, చందూర్ సొసైటీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను(grain purchase centers) ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. రైతులు మోసపోకుండా ప్రభుత్వ యంత్రాగం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణరెడ్డి, రంజ్యా నాయక్, అంబర్ సింగ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, సాయిబాబా, అశోక్, సాయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.