అక్షరటుడే, హైదరాబాద్: Double bedroom house | డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరిట భారీ మోసం huge scam హైదరాబాద్లో Hyderabad వెలుగు చూసింది. ఫోర్జరీ సంతకంతో forged signature నకిలీ మంజూరు పత్రాలు fake sanction documents సృష్టించిన ఓ వ్యక్తి వాటిని పలువురికి ఇచ్చి రూ.20 లక్షలు వసూలు చేసి పారిపోయాడు. మోసపోయామని తెలిసిన బాధితులు ప్రస్తుతం లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్ – బంజారాహిల్స్ Banjara Hills ప్రసాద్ లాబ్స్ లో ఆఫీసు బాయ్ గా పని చేస్తున్న నాగరాజు రెడ్డికి, అక్కడే ప్లంబింగ్ పని plumbing work చేసుకునే కొంతమంది పరిచయమయ్యారు. తనకు రాజకీయ పరిచయాలు ఉన్నాయని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు Double bedroom house ఇప్పిస్తానని వారి దగ్గర రూ.20 లక్షలు వసూలు చేశాడు.
ఫోర్జరీ సంతకంతో నకిలీ మంజూరు పత్రాలు fake sanction documents సృష్టించి వారికి నాగరాజు అందజేశాడు. నాగరాజు రెడ్డి ఇచ్చిన పత్రాలతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల double bedroom houses వద్దకు వెళ్లగా అవి నకిలీ మంజూరు పత్రాలని తెలిసి బాధితులు నోరెళ్లబెట్టారు.
బాధితులు victims నాగరాజు రెడ్డిని నిలదీయగా.. మరోచోట ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి, రాత్రికిరాత్రే ఆంధ్రప్రదేశ్ లోని Andhra Pradesh తన సొంత గ్రామానికి పారిపోయాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు రెడ్డిని వెతికి పట్టుకొని, తమ డబ్బులు ఇప్పించాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో Jubilee Hills police station ఫిర్యాదు చేశారు.