అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామంలో డబుల్ బెడ్ రూం, కల్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గోండ్ల రాజు, గోండ్ల శ్రీనివాస్, దేవానంద్ దేశముఖ్, పసుపుల రమేష్, ఇందూర్ లక్ష్మణ్, నాగొండ, లాలయ్య, కామప్ప, నల్ల లక్ష్మణ్, వీరప్ప పాల్గొన్నారు.