అక్షర టుడే, ఇందూరు: భారతీయ సంస్కృతికి కుటుంబ వ్యవస్థ ఆధారమని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురు చరణం అన్నారు. ఆదివారం గుండారం అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయంలో ఆర్ ఎస్ఎస్ నీలకంఠేశ్వర ఉద్యోగి ప్రభాస్ శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక చింతన కూడా అవసరమన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అన్ని కుటుంబాలకి తమ సిద్ధాంతాన్ని చేర్చాలన్నారు. ప్రతి సంవత్సరం ‘కుటుంబ మిలన్’ కార్యక్రమాలతో ప్రేమ పూర్వక వాతావరణం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఇందూరు విభాగ్ సహకార్యవాహ శ్రీనివాస్, గ్రామీణ వికాస్ ప్రాంత యోజక్ ప్రతాప్, శాఖ కార్యవాహ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.