అక్షరటుడే, బాసర: బాసర ఆర్జీయూకేటీ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా డాక్టర్ డి.రాజేశ్ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ కు చెందిన ఆయన సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ లో పనిచేశారు. అనంతరం మెదక్ డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం ఆర్జీయూకేటీ బాసరకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వర్సిటీ వీసీ గోవర్ధన్ మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement