Advertisement
అక్షరటుడే, ఇందూరు : DRDO | పసుపుతో తయారయ్యే పౌడర్, నూనెతో మహిళా సంఘాలకు ఉపాధి కలుగుతుందని ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, పుప్పాల నాగేష్ తెలిపారు. శుక్రవారం డీఆర్డీవో సాయాగౌడ్ను కలిసి ఉత్పత్తుల గురించి వివరించారు. పసుపు ఆధారిత వస్తువులతో మహిళా సంఘాలు మార్కెటింగ్ చేస్తూ లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం డీఆర్డీవో మాట్లాడుతూ.. త్వరలో మహిళా సంఘాలను పరిశ్రమ సందర్శనకు తీసుకొస్తానని పేర్కొన్నారు.
Advertisement