అక్షరటుడే, బాన్సువాడ: రైతులు వ్యవసాయంతో పాటు చేపల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని డీఆర్డీవో పీడీ సురేందర్‌ అన్నారు. బీర్కూర్‌ మండలంలో శుక్రవారం చేపల పెంపకంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్కో చేపల పెంపకం యూనిట్‌కు 35 శాతం, ఓసీ మహిళలకు 25 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. రైతులు ఈపథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తిమ్మాపుర్‌లో చేపల యూనిట్‌, కూరగాయలు ఇంటిగ్రేటెడ్‌ ఫామ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భారతి, ఎల్‌డీఎం రవికాంత్‌, డీపీఎం రమేష్‌ బాబు, ఏపీఎం గంగాధర్‌, రవి, విజయ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ayushman Arogya Mandir | దుర్కి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్​కు జాతీయస్థాయి గుర్తింపు