అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: స్వయం సహాయక సంఘాల మహిళలు కోళ్ల పెంపకం ద్వారా ఉపాధి పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్‌డీవో సురేందర్‌ సూచించారు. గురువారం దోమకొండలో ఎస్‌హెచ్‌జీ మహిళలకు కోళ్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక డంపింగ్‌ యార్డు, కంపోస్టు షెడ్డును పరిశీలించారు. చెత్తతో కంపోస్టు ఎరువు తయారీ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అలాగే ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఇంకుడు గుంతలను పరిశీలించారు. సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా గ్రామాల్లో ఫాగింగ్‌ చేపట్టాలని ప్రత్యేకాధికారి జ్యోతికి చెప్పారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్, ఏపీవో రాజు, ఏఈ ప్రదీప్, మహిళలు ఉన్నారు.