అక్షర టుడే, వెబ్ డెస్క్ Onion Tea : ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఒక కప్పు టీ తాగంది ఏ పని కూడా చేయరు. కొందరికి బెడ్ కాఫీని తాగే అలవాటు కూడా ఉంటుంది. కాఫీ అలవాటు కూడా ఉంటుంది. రోజుకు రెండు, మూడు కప్పులు టీ తాగుతూ ఉంటారు. దానికి ప్రతిరోజు రెండు మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగే వారు కూడా ఉన్నారు. ఎక్కువ కప్పుల టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఉదయాన్నే పరగడుపున టీ, కాఫీలు అధికంగా తాగితే, అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఉదయాన్నే టీ కాఫీ తాగితే కొంతమందిలో పొట్ట సంబంధించిన సమస్యలు కూడా ఇబ్బందులు పెడతాయి. అయితే, కొంతమంది గ్రీన్ టీ ని కూడా తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి కొంతవరకు మంచిదే. ఇలాంటి టీ తో సమానమైన టి ఉల్లిపాయల టీ.
ఉల్లిపాయల టీ ని పరగడుపున తాగితే అధిక బెనిఫిట్స్ పొందవచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లిపాయల టీ అనగానే మీరు ఆశ్చర్యపోతున్నారు కదా… అవును దీని ప్రయోజనాలు కూడా తెలిస్తే ఆశ్చర్యపోతారు.. దీని గురించి తెలిసిన వారు ఈ టీ తాగకుండా ఉండలేరు. మరి ఆ ప్రయోజనాలే ఏమిటో తెలుసుకుందాం.. కాఫీలు, టీ లు అధికంగా తాగితే ఆరోగ్యానికి నష్టం వాటిల్ల వచ్చు. అయితే, అలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయల టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉల్లిపాయల టీలో లభించే మూలకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లిపాయలతో చేసిన టీ ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి ఫ్లేవర్ అనే పోషకం పుష్కలంగా లభిస్తుంది. దినివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా ఉల్లిపాయల టీ తాగితే గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆనియన్స్ టీ ని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిందల్లా కొన్ని మసాలా దినుసులు. ఉల్లిపాయలు, ఉల్లిపాయ టీ నిద్రలేమి, అధిక రక్తపోటు, క్యాన్సర్, చక్కెర స్థాయి, రక్తహీనత, కడుపు సంబంధించిన వ్యాధి, బరువును తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. మీరు వ్యాధులను దూరంగా ఉంచుకోవాలనుకుంటే.. ఈరోజు నుండే ఉల్లిపాయల టీ తేనీ క్రమం తప్పకుండా తాగడం అలవాటు చేసుకోవాలి. ఉల్లిపాయల టీ తాగడం మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ మీరు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే దాని ప్రయోజనాలు మీకు స్పష్టంగా తెలుస్తుంది. క్యాన్సర్ ఉన్నవారు ఈ ఉల్లిపాయలు టీ తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. షుగర్ పేషెంట్లు కూడా ఈ ఉల్లిపాయల టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రక్తఫోటు నివారణ కూడా చేస్తుంది.
ఉల్లిపాయల టీ ఎలా తయారు చేయాలి : ఈ టీ తయారు చేసుకోవాలంటే మొదట ఒక పెద్ద గిన్నెను తీసుకొని. అందులో రెండు గ్లాసుల నీటిని పోసుకొని మసాలా దినుసులు వేసి, ఉల్లిపాయలు వేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. అన్ని ఉడకపెట్టిన తర్వాత ఒక తీసుకొని ఆ గ్లాసులో ఈ టీ ని వడకట్టాలి. దీనిలోకి కావాల్సినంత తేనెను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఖాళీ కడుపుతో తాగితే అన్ని రకాల అనారోగ్య సమస్యలు పరారవుతాయి.