NIZAMABAD CITY | తాగునీటి కొరత రాకుండా చూడాలి
NIZAMABAD CITY | తాగునీటి కొరత రాకుండా చూడాలి

అక్షరటుడే, ఇందూరు: NIZAMABAD CITY | నగరంలో తాగునీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ(SHABBIR ALI) అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్(COLLECTRATE)​లో సంబంధిత అధికారులతో రివ్యూ(REVIEW) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వ(CONGRESS GOVERNMENT) అధికారంలోకి వచ్చాక నగరానికి రూ. 400 కోట్లు కేటాయించిందన్నారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం వీడాలని.. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని పనులకు సంబంధించి నిధులు విడుదలై ఆర్నెళ్లు గడుస్తున్నా పనులు సక్రమంగా జరగట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

NIZAMABAD CITY | అధికారులు నివేదిక ఇవ్వాలి..

నగరంలో అభివృద్ధి పనులకు సంబంధించి మంజూరైన పనులు, టెండర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిధుల వివరాలు వాటి పురోగతిని నివేదిక సమర్పించాలని ఆయా శాఖ​ల అధికారులను ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి గోదావరి జలాలు అమృత్–1, అమృత్–2 పారిశుధ్యం, డ్రెయినేజీ, సెంట్రల్​ లైటింగ్​ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, నుడా ఛైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | టీజీవో ఆధ్వర్యంలో ఇఫ్తార్​