అక్షరటుడే, నిజామాబాద్: కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఏసీపీలు బదిలీ అయ్యారు. ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ బదిలీ కాగా ఆయన స్థానంలో ఖమ్మం రూరల్ లో పనిచేస్తున్న బస్వారెడ్డి నియమితులయ్యారు. బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ బదిలీ కాగా ఆయన స్థానంలో ఐటీ సెల్ లో పనిచేస్తున్న పి.శ్రీనివాస్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కామారెడ్డి డీఎస్పీ ప్రకాష్ మంచిర్యాల ఏసీపీగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సైబర్ విభాగంలో పనిచేస్తున్న డి.రాజేశ్వర్ బదిలీపై వస్తున్నారు. ఆర్మూర్, బోధన్ కు వస్తున్న ఇద్దరు ఏసీపీలు కూడా గతంలో జిల్లాలో సీఐలుగా పనిచేశారు.