అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhayya Sunny Yadav | సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ Bhayya Sunny Yadav పరారీలో ఉన్నట్లు సూర్యాపేట డీఎస్పీ రవి (DSP Ravi) తెలిపారు. సూర్యాపేట(Suryapeta) జిల్లా నూతన్‌కల్ మండలానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యాడు. బైక్ రైడింగ్ చేసే ఆయనకు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అయితే సన్నీయాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలు (టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్) ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. దీంతో ఆయనపై నూతన్‌కల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం సన్నీయాదవ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Bhayya Sunny Yadav | సజ్జనార్ పోస్ట్‌తో..
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రజలను ఆన్లైన్ మోసాలపై(Cyber Crimes) అప్రమత్తం చేస్తూ పోస్టులు పెడుతుంటారు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తుండటంపై ఆయన పోస్టు పెట్టడంతో స్పందించిన పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు.
Bhayya Sunny Yadav | ఇదేం పని..
సోషల్ మీడియా(Social Media)లో ఫేమస్ కావడానికి చాలా మంది కష్టపడుతున్నారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. తమ కంటెంట్‌తో ఫేమస్ అయ్యాక ఇన్ఫ్లూయెన్సర్లుగా మారి డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక్క సారి వచ్చిన క్రేజ్‌తో డబ్బు సంపాదించుకోవాలని.. కొందరు బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ చేస్తున్నారు. సన్నీ యాదవ్ ఇలా చేయడంతోనే కేసు నమోదు అయింది. మరికొందరు నాణ్యత లేని వస్తువులు బాగున్నాయని వీడియోలు చేసి మరి పోస్టులు పెడుతున్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు మోసపోతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.