అక్షరటుడే, వెబ్‌డెస్క్ః KEDAR DEATH : సినీ నిర్మాత, రియల్టర్ సెలగం శెట్టి(SELAGAM SHETTY KEDAR) కేదార్ మృతిపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. దుబాయ్‌లోని ఓ హోటల్లో ఫిబ్రవరి 24న ఆయన మృతి చెందగా.. ఈ ఘటన పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే.. పదిరోజుల తర్వాత దుబాయ్(DUBAI) పోలీసులు ఆయన మరణంపై పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్(POSTMORTEM REPORT)విడుదల చేశారు. కేదార్‌ది సహజ మరణమేనని తెలిపారు. అనంతరం ఆయన మృతదేహాన్ని భారత ప్రభుత్వ అనుమతితో కేదార్ భార్యకు అప్పగించారు.
KEDAR DEATH : కేదార్ భార్య సంచలన నిర్ణయం..
దుబాయ్‌లో మృతి చెందిన నిర్మాత కేదార్ ది సహజ మరణమేనని దుబాయ్ పోలీసులు(DUBAI POLICE) ధృవీకరించినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంలో ఆయన మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. దీంతో కేదార్ భార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య కేదార్ అంత్యక్రియలను దుబాయ్‌లోనే పూర్తిచేశారు.
KEDAR DEATH : సీఎం రేవంత్‌రెడ్డి సైతం..
తెలుగు సినీ నిర్మాత సెలగం శెట్టి కేదార్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM REVANTH REDDY) సైతం వ్యాఖ్యలు చేశారు. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సినీనిర్మాత కేదార్, కాళేశ్వరం ప్రాజెక్ట్(KALESHWARAM PROJECT)పై కేసు వేసిన లింగమూర్తి, ఓ న్యాయమూర్తి వరుసగా మృతి చెందడంపై సీఎం అనుమానాలు వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
KEDAR DEATH : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ఫండింగ్..
కేదార్ పలు సినిమాలు(MOVIE) నిర్మించగా ఆ సినిమాలకు పలువురు బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు రూ. కోట్లల్లో ఫండింగ్(FUNDING) చేసినట్లు తెలిసింది. అయితే కేదార్ ఆకస్మిక మృతితో వారిలో ఆందోళన మొదలైందని సమాచారం. దీంతో వారిచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకునే ప్రయత్నాలు చేశారని.. ఆయన దుబాయ్‌లో మరణించిన సమయంలో పలువురు బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు కూడా దుబాయ్(DUBAI)లోనే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
KEDAR DEATH : విచారణ చేయాలని కిషన్‌రెడ్డికి వినతిపత్రం..
సెలగం శెట్టి కేదార్ మృతిపై అనేక అనుమానాలున్నాయని.. కేంద్ర ప్రభుత్వం ఈ మృతిపై ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి(CHAMALA KIRAN KUMAR REDDY) విజ్ఞప్తి చేశారు. మంత్రి కిషన్‌రెడ్డి(MINISTER KISHAN REDDY)కి వినతిపత్రం అందజేశారు. అయితే తాజాగా దుబాయ్ పోలీసులు ఆయనది సహజ మరణమేనని తేల్చడం గమనార్హం.