అక్షరటుడే, బాన్సువాడ : తాపీ మేస్త్రీలు, నిర్మాణ రంగ కార్మికులు ప్రతిఒక్కరూ లేబర్‌ కార్డులను ఏఐటీయూసీ యూనియన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్‌ రాములు సూచించారు. మండలంలోని కొత్తబాది గ్రామంలో బుధవారం తాపీ మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. లేబర్‌ కార్డు కలిగి ఉన్న వారికి డెలివరీ, మ్యారేజ్‌ బెనిఫిట్స్‌ వర్తిస్తాయని, సహజ మరణం, ప్రమాదవశాత్తు మరణాలకు కార్మిక శాఖ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందన్నారు. వెల్ఫేర్‌ బోర్డును ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీకి కట్టబెట్టే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సాయిలు, శ్రీనివాస్‌, నారాయణ తదితరులు పాల్గన్నారు.