అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : జీవితంపై విరక్తితో ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందల్వాయిలోని లింగాపూర్‌నకు చెందిన యువకుడు సాకలి రాము(26) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై నాలుగురోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబీకులు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాము బుధవారం మృతి చెందాడు.