అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ కు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్ లోకి భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 54,200 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1395.47 అడుగుల (8.192 టీఎంసీ) నీరు నిల్వ ఉంది.