అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా 1391.72 అడుగుల (5.022 టీఎంసీల) నీరు నిల్వ ఉందని ఏఈ శివప్రసాద్ తెలిపారు. సాయంత్రానికి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కళ్యాణి ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.80 మీటర్లకు గాను 408.00 మీటర్లు ఉంది.