అక్షరటుడే, జుక్కల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగితం అలుగు పైనుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టులోకి ఆదివారం ఉదయం ఎగువ నుంచి 1500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. సింగితం ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో వెయ్యి క్యూసెక్కుల నీటిని మూడు వరద గేట్ల ద్వారా నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నారు. మరో 500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు అలుగు నుంచి మంజీరలోకి ప్రవహిస్తోంది.