అక్షరటుడే, బాన్సువాడ: వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల రూ. లక్ష విలువ చేసే పాడి గేదె మృతి చెందిన ఘటన వర్నిలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలో కుమ్మరి బాపురావుకు చెందిన పాడి గేదె రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడగా.. చికిత్స కోసం వైద్యాధికారులకు, గోపాలమిత్రలకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చాడు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పాడి గేదె మృతిచెందినట్లు బాధితుడు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పాడి గేదె గురువారం ఉదయం మృతి చెందినట్లు చెప్పాడు. వైద్యులు, గోపాలమిత్రలు వైద్యం అందించలేదని వారిపై జిల్లా వెటర్నరీ అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.